భార్య కేసు పెట్టిందని..

ఉప్పల్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కేసు పెట్టినందుకు భర్త పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. చిలుకానగర్‌లో నివాసముండే సురేష్‌ (26) మేనత్త కూతురును ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే భర్తపై భార్య వరకట్నం కేసు పెట్టింది. సోమవారం బాటిల్‌లో పెట్రోల్‌ తెచ్చుకుని ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు వద్ద పెట్రోల్‌ పోసుకుని పెద్దగా అరిచాడు. పోలీసులు సురేష్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.