100 కోట్ల క్లబ్‌లో గీత గోవిందం..!

-

ఇదివరకు 100 కోట్ల క్లబ్ అనేది తెలుగు సినిమా కల. ఆ కల ఇప్పుడు అలవోకగా తీరిపోతోంది. ఎందుకంటే.. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజయిన గీత గోవిందం సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. సినిమా రిలీజయిన 12 రోజుల్లోనే గీత గోవిందం సినిమా ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్‌ను రాబట్టిందట. అది కూడా ఓ యువ కథానాయకుడు నటించిన సినిమా ఇలా ఇంత త్వరగా 100 కోట్ల క్లబ్‌లో చేరేసరికి తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచమంతా వ్యాపించినట్టేనని ఇండస్ట్రీ పేర్కొంటోంది.

ఇక.. హీరో విజయ్ దేవరకొండ విషయానికి వస్తే.. వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన యువ కథానాయకుడిగా విజయ్ చరిత్ర సృష్టించాడు. యూఎస్‌లో ఈ సినిమా 2 మిలియన్ క్లబ్‌లో అడుగు పెట్టిందట. ఇక.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 100 కోట్లు వసూలు చేసిన అతి తక్కువ మంది హీరోల జాబితాలో విజయ్ చేరిపోయాడు. అయితే.. ఈ సినిమా కేవలం విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక నటన వల్లే సూపర్ సక్సెస్ అయిందంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version