Godfather:సినిమా కూడా డిజాస్టరేనా..ఎన్ని కోట్లు నష్టమంటే..?

-

చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమా అంచనాలను మించి కలెక్షన్ సొంతం చేసుకుంది అనే వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత భారీ స్థాయిలో కలెక్షన్లు మాత్రం రాబట్టుకోలేకపోయింది. ఈ సినిమా అడ్వాన్స్ లు తీసుకొని నిర్మాతలు రిలీజ్ చేశారు.అయితే ప్రస్తుతం మార్కెట్ లెక్కల ప్రకారం ఈ చిత్రం దాదాపుగా రూ. 14.5 కోట్ల రూపాయలు నష్టాన్ని మిగిల్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

గాడ్ ఫాదర్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చినా కూడా చిరంజీవి రేంజ్ తగ్గట్టుగా కలెక్షన్లు రాలేదని వార్తలు వినిపిస్తున్నాయి am గాడ్ ఫాదర్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన కమర్షియల్ అంశాలు లేకపోవడంతో ఈ సినిమా సాధారణ ప్రేక్షకులు సైతం ఆసక్తి చూపలేదు. అంతేకాకుండా లూసిఫర్ సినిమా చూసిన ప్రేక్షకులు సైతం గాడ్ ఫాదర్ సినిమా పైన చూడడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇక మరొకవైపు దసరా పండుగ కానుకగా ఎన్నో చిత్రాలు థియేటర్లో విడుదల కావడం కూడా గాడ్ ఫాదర్ సినిమా కి కాస్త మైనస్ గా మారిందని చెప్పవచ్చు.

కన్నడ చిత్రమైన కాంతార సినిమా విడుదల కావడం వల్ల అన్ని సినిమాల పైన ఈ సినిమా ప్రభావం గట్టిగానే చూపుతోందని చెప్పవచ్చు. ఇక దీపావళి పండుగ సందర్భంగా సెలవు ఉన్నప్పటికీ కూడా అంతంత మాత్రమే గాడ్ ఫాదర్ సినిమా కలెక్షన్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో బిజినెస్ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ చిత్రంతోనైనా చిరంజీవి సరికొత్త రికార్డులను తిరగ రాస్తారేమో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news