ది కశ్మీర్ ఫైల్స్.. దేశ వ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తున్న సినిమా. చిన్న సినిమాగా ప్రారంభం అయిన ది కశ్మీర్ ఫైల్స్ పెను సంచలనంగా మారింది. ది కశ్మీర్ ఫైల్స్ సినిమా మొదట చాలా తక్కువ థీయేటర్స్ లలో విడుదల అయింది. అనంతరం సినీ అభిమానుల డిమాండ్ తో చాలా థీయేటర్స్ లలో ఈ సినిమా ప్రదర్శన జరుగుతుంది. అంతే కాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ సినిమాపై వినోదపు పన్ను ను కూడా మినహాయింపు చేశాయి.
అలాగే మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు ఏకంగా ఒక రోజు సెలవు కూడా ఇస్తున్నట్టు ప్రకటించింది. కాగ ఈ సినిమా హిట్ కావడంతో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన వద్ద ఈ సినిమా కు సంబంధించిన చాలా సమాచారం ఉందని అన్నారు. ఈ సమాచారంతో త్వరలోనే ఒక వెబ్ సిరీస్ చేస్తానని ప్రకటించారు.
ది కశ్మీర్ ఫైల్స్ ను వెబ్ సిరీస్ గా తెరకెక్కిస్తే… హృదయాన్ని ద్రవింప జేసే విధంగా ఉంటుందని అన్నారు. ఈ సినిమా గురించి పలువురితో చర్చించిన తర్వాత.. కశ్మీర్ లో హిందువులపై ఇలాంటి దారుణాలు జరిగాయా అని అన్నారు. చాలా మంది నమ్మలేదని కూడా అన్నారు. కాగ అతి త్వరలోనే తాను ది కశ్మీర్ ఫైల్స్ ను వెబ్ సిరీస్ గా రూపొందిస్తానని ప్రకటించారు.