పవన్ కల్యాణ్ అంటే జగన్ సేనకు ఎందుకో అంత కోపం. పోనీ ఆయనేమయినా పెద్ద పొలిటీషియనా కాదు కదా! ఒక్క సీటు కూడా లేని జనసేన ఏ మేరకు రాజకీయంను ప్రభావితం చేస్తుందని అనుకుంటారో ఆ వైసీపీ నాయకులు.ఇప్పుడే కాదు ప్రతీసారీ పవన్ మాట్లాడిన వెంటనే మాటలతో దాడులకు సిద్ధం అయి ఉంటారు.
నిన్నటి వేళ కూడా పవన్ స్పీచ్ ఇంకా మొదలే కాలేదు అంతా అంటే వైసీపీ మంత్రులంతా తగువులకు సిద్ధం అయిపోయారు.దీని వల్ల నష్టపోయేది వైసీపీనే! రాజకీయాల్లో ఆ పాటి హుందాతనం పాటించడం నేర్చుకోకపోతే ఎలా?
ఇక నిన్నటివేళ అంబటి రాంబాబును పేర్ని నానిని ఇంకా చాలా మందిని పేర్లు చెప్పి కొందరిని పేర్లు చెప్పక ఇంకొందరిని టార్గెట్ చేశారు పవన్. వెల్లంపల్లిని ఇంకా అవంతిని ఒక్కరేంటి వైసీపీలో ఉంటూ నోరేసుకుని పడిపోయే నాయకులందరినీ పవన్ టార్గెట్ చేసి తన దైన పంథాలోవారిపై వాగ్బాణాలు సంధించారు. ఇవన్నీ ఎలా ఉన్నా పవన్ ను చూస్తే వైసీపీకి వణుకు అన్నది ఖాయం.
ఎందుకంటే పవన్ ప్రభావం ఎలా లేదన్నా రాష్ట్రం అంతా ఉంది. ఆ మాటకు వస్తే తెలంగాణలోఅయితే ఇంకా ఎక్కువ. ఎన్నికల్లో గెలిచినా ఓడినా కొన్నిసార్లే న్యాయం గెలుస్తుంది అన్నమాటకు పవన్ కట్టుబడి ఉంటారు. కొంతలో కొంత ఉన్నది పేదలకు పంచేందుకు ఇష్టపడతారు. వైసీపీ నాయకుల్లా నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి వ్యాపారాలు చేయడం వాటితో లావాదేవీలు నడపడం ఆయనకు చేతగాని పని.అదేవిధంగా పవన్ ప్రత్యర్థి పార్టీల లీడర్లనూ ఎంతో గౌరవిస్తారు ఇదే ఆయన ఇమేజ్ ను ఇవాళ ఎంతో స్థాయి తీసుకువెళ్లింది.ఆఖరికి జగన్ కార్యకర్తలకు కూడా నిన్నటివేళ నమస్కారం చెప్పారు. నమస్కారం జనసేన సంస్కారం అని అంటారాయన. అదేవిధంగా పవన్ గెలవకపోయినా జనం మధ్య ఉంటారు. గెలిచాక కూడా ఇవాళ ఎందరో వైసీపీ ఎమ్మెల్యేలు జనం మధ్య లేరు.అందుకే పవన్ అంటే జగన్ వర్గాలకు వణుకు.