మ్యూజిక్ వరల్డ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రపంచ దేశాలకు చెందిన సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అందులో కొంతమంది తమ పాటలతో అలరించారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతీయ సంగీత కళాకారులు శంకర్ మహదేవన్, జాకిర్ హుస్సేన్‌లు సత్తా చాటారు. వారు కంపోజ్ చేసిన ‘దిస్ మూమెంట్’ ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డును సొంతం చేసుకుంది.
గ్రామీ 2024 విజేతలు..
ఉత్తమ ర్యాప్ ఆల్బమ్ – మైఖేల్ (కిల్లర్ మైక్)
ఉత్తమ ఆఫ్రికన్ సంగీత ప్రదర్శన – టైలా (వాటర్)
మ్యాజిక్ వీడియో – జోనథన్ క్లైడ్ ఎమ్ కూపర్ (ఐయామ్ ఓన్లీ స్లీపింగ్)
గ్లోబల్ మ్యూజిక్ ప్రదర్శన – జాకిర్ హుస్సేన్, బెలా ఫెక్ (పష్టో)
గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ – శక్తి (దిస్ మూమెంట్)
ఉత్తమ క్లాసికల్ సోలో వోకల్ ఆల్బమ్ – జూలియా బూల్లక్, సోలోయిస్ట్ (వాకింగ్ ఇన్ ద డార్క్)
ఉత్తమ రాక్ ఆల్బమ్ – పారామోర్ (దిస్ ఇజ్ వై)
ఉత్తమ రాక్ సాంగ్, ప్రదర్శన – బాయ్‌జెనియస్ (నాట్ స్ట్రాంగ్ ఎనఫ్)
ఉత్తమ కామెడీ ఆల్బమ్ – డేవ్ చాపెల్ ( వాట్స్ ఇన్ ఏ నేమ్)
ఉత్తమ కంట్రీ సాంగ్, సోలో ప్రదర్శన – క్రిస్ స్టేప్లెటన్ (వైట్ హార్స్)