గ్రాండ్ గా శర్వానంద్ పెళ్లి రిసెప్షన్.. అతిథులు వీళ్ళే..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ ఎట్టకేలకు జూన్ మూడవ తేదీన రక్షిత రెడ్డిని వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇకపోతే వీరిద్దరి వివాహం రాజస్థాన్ జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ఐటీ మినిస్టర్ కేటిఆర్, ఎంపీ సంతోష్ కుమార్, సినీ హీరో విక్టరీ వెంకటేష్ తదితరులు హాజరయ్యి కొత్తజంటను ఆశీర్వదించారు.

రిసెప్షన్ కి వచ్చిన అతిథులు కేటీఆర్ తో సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపించడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ వివాహానికి ఆహ్వానిస్తూ శర్వానంద్ స్వయంగా ప్రగతి భవన్ కు వెళ్లి ఎంపీ సంతోష్ కుమార్ కు ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగింది. ఆ తర్వాత రిసెప్షన్ కి ఆహ్వానిస్తూ సీఎం కేసీఆర్ ను కలిసి ఇన్విటేషన్ ఇచ్చిన ఫోటోలను కూడా శర్వాలను షేర్ చేశారు.

ఇకపోతే ఈ వేడుకలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన అక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. భార్యతో కలిసి శర్వానంద్ రిసెప్షన్ కు హాజరైన రామ్ చరణ్ అక్కడ భార్య చేయి పట్టుకుని నడిపించిన తీరు అందర్నీ మరింత ఆకట్టుకుంది. మొత్తానికి అయితే శర్వానంద్ రిసెప్షన్ కూడా చాలా గ్రాండ్గా జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version