వారికి గుడ్ న్యూస్.. ఇక నుండి పండుగే..!

-

చాలా మంది రిటైర్ అయ్యే లోగా డబ్బులని పొదుపు చేసుకోవాలని చూస్తూ వుంటారు. అలా పొదుపు చేసుకుంటే రిటైర్ అయ్యే నాటికి మంచిగా లాభాన్ని పొందవచ్చు. సురక్షిత పదవీవిరమణ పెట్టుబడి పథకాలలో నేషనల్ పెన్షన్ స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ లో డబ్బులని పెట్టడం వలన రిస్క్ ఉండదు. ఈ రోజుల్లో చాలా మంది ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము భరోసా ఉంటుంది.

అయితే కేంద్రం ఈ స్కీము లో ఉండే కొన్ని నిబంధనలను మార్పు చేయాలని భావిస్తోంది. దీని ద్వారా ఖాతాదారులకు నగదు ఉపసంహరణ సులభం అవడంతో పాటు అధిక వెసులుబాటు ఇస్తోంది. ఇక నేషన్ పెన్షన్ స్కీమ్(ఎన్ పీఎస్)లో ప్రభుత్వం ఏ రూల్ ని తీసుకు వస్తుందో చూద్దాం. కొన్ని న్యూ రూల్స్ ని నేషన్ పెన్షన్ స్కీమ్ సబ్ స్క్రైబర్స్ కోసం పెన్షన్ ఫండ్ రెగ్యూలేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ తీసుకు వచ్చింది. దీనికి సిస్టమేటిక్ లంప్సమ్ విత్ డ్రాల్స్ అనే పేరు పెట్టింది.

ఖాతాదారుడు తాను పెట్టిన పెట్టుబడి నుంచి నగదును తన అవసరాలకు అనుగుణంగా ఇన్ స్టాల్ మెంట్స్ మార్గంలో ఉపసంహరించుకోవచ్చు. ఎన్పీఎస్ ఖాతాదారులు వారి ఇష్టానుసారంగా నగదు విత్ డ్రాల్స్ చెయ్యచ్చు. సిస్టమాటిక్ లప్సమ్ విత్ డ్రాల్ ఫెసిలిటీ ద్వారా ఇష్టానుసారంగా నగదు విత్ డ్రాల్స్ చెయ్యచ్చు. స్కీమ్‌లో చేరిన వారు మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి భారీ మొత్తం పొందాల్సి ఉంటుంది. పెన్షన్ ప్లాన్ కొనాల్సి ఉంటుంది.

తర్వాత మిగిలిన మొత్తాన్ని కూడా మీరు ఒక సారె పొందొచ్చు. కనీసం 40 శాతాన్ని పెట్టి పెన్షన్ ప్లాన్ కొనాలి. ఇక మిగిలిన 60 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చెయ్యచ్చు. విడతల వారీగా కూడా మెచ్యూరిటీ మొత్తాన్ని పొందవచ్చు. ఒక నెల , మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం చొప్పున డబ్బులను విత్‌డ్రాయెల్ చేసుకోవచ్చు. 75 ఏళ్లు వచ్చే వరకు డబ్బులు పొందొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version