Big Boss OTT Telugu: ఈ వారం డబుల్ ఎలిమినేషన్..అజయ్, హమీదలు ఔట్?

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ఆరో సీజన్ తెలుగు ‘ఓటీటీ’ వర్షన్ కొనసాగుతోంది. ఎనిమిదో వారంలో కంటెస్టెంట్స్ హౌజ్ లో ఉన్నారు. గత వారం మహేశ్ విట్టా హౌజ్ నుంచి ఎలిమినేట్ కాగా, ఈ వారం ఎలిమినేట్ ఎవరు కాబోతున్నారనేది చాలా ఆసక్తికర చర్చనీయాంశంగా ఉంది.

ఇప్పటి వరకు ‘బిగ్ బాస్’ ఇంటి సభ్యుల్లో ఆట పరంగా అందరూ కంటెస్టెంట్స్ తమ గతంతో పోల్చితే మెరుగయ్యారు. కాగా, ఓటింగ్ పర్సంటేజీలో మాత్రం ఇప్పటి వరకు ఉన్న పర్సంటేజీలో అజయ్ అందరికంటే వెనుకబడ్డాడు. ఈ క్రమంలోనే సింగిల్ ఎలిమినేషన్ ఉంటే కనుక కంపల్సరీగా అజయ్ ఇంటి నుంచి బయటకు వస్తారని వార్తలొస్తున్నాయి.

ఒకవేళ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఓటింగ్ పర్సంటేజీ పరంగా చూసుకుంటే అజయ్, అషురెడ్డి..ఇద్దరూ హౌజ్ నుంచి బయటకు రావాలి. కానీ, ఈ సారి అషురెడ్డిని ‘బిగ్ బాస్’ సేవ్ చేయాలని చూస్తున్నారని వార్తలొస్తున్నాయి.

హమీదను ఎలాగైనా ఈ సారి ఎలిమినేషన్ కంటెస్టెంట్ గా ప్రొజెక్ట్ చేయాలనే ఆలోచనలో ‘బిగ్ బాస్’ ఉన్నట్లున్నారని బీబీ లవర్స్ అంటున్నారు. చూడాలి మరి.. వీకెండ్ ఎంట్రీలో హోస్ట్ నాగార్జున ఎవరిని ఎలిమినేట్ చేస్తారో..

Read more RELATED
Recommended to you

Latest news