Hansika Motwani: “మై నేమ్ ఈజ్ శృతి” అంటున్న హన్సిక.. ఈ ఊహించ‌ని ట్విస్టెంటీ?

-

Hansika Motwani: ‘దేశ‌ముదురు’ తో టాలీవుడ్లో అడుగుపెట్టిన హీరోయిన్ హ‌న్సిక… ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన అతి త‌క్కువ కాలంలోనే అగ్ర‌క‌థానాయిక‌గా గుర్తింపును సొంతం చేసుకున్న‌ది. విభిన్న క‌థాంశాలు, వినూత్న పాత్రలు చేసే.. ఈ అమ్మ‌డు. ప్ర‌స్తుతం ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందంట‌.. నిత్య జీవితంలో మ‌హిళ‌లు ఎలాంటి స‌మ‌స్యలు ఎదుర్కొంటున్నారు. ఆ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే క్రమంలో ఎదుర్కొనే ప‌రిణామాల నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న చిత్రమే “మై నేమ్ ఈజ్ శృతి”.

శ్రీ‌నివాస్ ఓంకార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని వైష్ణ‌వి ఆర్ట్స్ ప‌తాకంపై ర‌మ్య బురుగు, నాగేంద్ర‌రాజు నిర్మిస్తున్నారు. ఈ తరుణంలో మూవీ మేక‌ర్స్ ప్రెస్ మీట్ నిర్వ‌హించారు. లేడీ ఓరియెంట్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో.. తన మనోభావాలను ధైర్యంగా వెల్లడించే యువతి పాత్రలో హన్సిక క‌నిపించ‌నున్న‌ది తెలిపారు. ముగింపు వరకు ఎవరూ ఊహించలేని ట్విస్ట్‌లు, స‌ర్‌ప్రైజింగ్ క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కుతుంద‌ని తెలిపారు.

ఇప్పటి వరకు 85శాతం షూటింగ్ పూర్తి అయిన‌ట్లు తెలిపారు. మిగిత పార్ట్ ను త్వరలోనే హైదరాబాద్‌లో చిత్రీకరిస్తామ‌ని తెలిపారు. మురళీశర్మ, ఆడుకలం నారాయణ్, జయప్రకాష్ (జేపీ), ప్రవీణ్, సీవీఎల్ నరసింహారావు, కేదారి శంకర్, పూజా రామచంద్రన్ తదితరులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి మార్క్ రాబీన్ సంగీతం అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news