Anand Devarakonda: సైలెంట్ గా “బేబీ”ని లైన్లో పెట్టేన విజయ్ దేవరకొండ తమ్ముడు..!

-

Anand Devarakonda: ఆనంద్ దేవరకొండ.. విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అయినా తన సొంత ట్యాలెంట్ తో అంచెలంచలుగా ఇండ‌స్ట్రీలో ఎదుగుతున్నాడు. హిట్ ప్లాప్ ల‌తో సంబంధం లేకుండా.. దూసుక‌పోతున్నాడు రౌడీ బ్ర‌ద‌ర్. ఆనంద్ తొలి సినిమా దొరసాని. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా… ఆనంద్ దేవరకొండ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఆ సినిమా తర్వాత సినిమా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ తో మెప్పించాడు. ఆ మూవీ ఓటిటిలో రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. అటు తర్వాత ‘పుష్పకవిమానం’ అనే లవ్ స్టోరీలో నటిస్తూనే మరో పక్క గుహన్ దర్శకత్వంలో ‘హైవే’ అనే చిత్రాన్ని కంప్లీట్ చేసాడు. ఇప్పుడు సైలెంట్ గా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుని కూడా లైన్లో పెట్టేసాడు.

ట్యాలెంటెడ్ డైరెక్టర్ సాయి రాజేష్ ద‌ర్శ‌క‌త్వంలో ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బేబీ’. టాక్సీవాలా’ వంటి హిట్ సినిమాని రూపొందించిన ఎస్. కె. ఎన్ నిర్మాణంలో ‘బేబీ’ అనే చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమా గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్‌.

ఇక ఈ చిత్రం రెగుల‌ర్ షూటింగ్ ఈ నెల 20 నుండీ ప్రారంభం కానుందని మూవీ మేక‌ర్స్ తెలిపారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. ‘100 పర్సెంట్ లవ్’, ‘వన్ నేనొక్కడినే’,’పుష్ప’ వంటి భారీ చిత్రాలకు పని చేసిన కార్తిక్ శ్రీనివాస్ ఈ చిత్రానికి కూడా ఎడిటర్ గా పనిచేస్తుండడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news