3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసిన హనుమాన్.. 2024లో తొలి బ్లాక్ బస్టర్

-

ఇప్పుడు ఎక్కడ చూసినా హనుమాన్ సినిమా పేరే మార్మోగిపోతోంది. జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఫిదా చేసింది. ఓవైపు మంచి టాక్ సంపాదించడమే కాదు మరోవైపు సూపర్ డూపర్ కలెక్షన్లు కూడా సాధిస్తోంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ ఏడాది బ్లాక్బస్టర్గా నిలిచిన తొలి సినిమాగా ‘హను-మాన్’ మూవీ రికార్డు క్రియేట్ చేసింది.

సూపర్ హిట్ మౌత్ టాక్తో ఓపెనింగ్ డే కంటే తర్వాత రెండు రోజులు హనుమాన్ ఎక్కువ ఆక్యుపెన్సీతో రన్ అవ్వడం గమనార్హం. ఇక ఈ సినిమాతో పాటు సంక్రాంతి బరిలో నిలిచిన మూడు సినిమాలు అంతగా ప్రభావం చూపకపోవడం హనుమాన్ మూవీకి మరింత కలిసి వస్తోంది. రిలీజైన మూడు రోజుల్లోనే ‘హను-మాన్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకొని, ప్రస్తుతం లాభాల్లోకి ఎంటర్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మూడు రోజుల్లో ఇప్పటివరకు సినిమా వరల్డ్వైడ్గా రూ.30కోట్ల మార్క్ క్రాస్ చేసినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్లో ఇప్పటికే ఈ సినిమా 2 మిలియన్ డాలర్లు వసూల్ చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version