‘హనుమాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్లుగా ప్రభాస్, బాలకృష్ణ!

-

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన సినిమా హనుమాన్. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం జనవరి 12వ తేదీన పాన్ ఇండియా వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్లో జోరు పెంచింది. ఈ క్రమంలోనే హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ఈవెంట్ను ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తరహాలో చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తోందట. విజయవాడ లేదా తిరుపతిలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ఉండనున్నట్లు సమాచారం.

Special poster from Hanuman

ఈ ఈవెంట్కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నటసింహం నందమూరి బాలకృష్ణలను చీఫ్ గెస్టులుగా ఆహ్వానించాలని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చాలా ప్రయత్నిస్తున్నారట. ఆదిపురుష్ ఈవెంట్లాగే ఈ ప్రోగ్రామ్లో కూడా భారీ స్టేజ్ సెటప్తో పాటు గ్రాండ్ డిజైనింగ్స్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. జనవరి 7వ తేదీన హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news