హ్యాపీ బర్తడే సల్లు భాయ్, ట్రెండ్ సెట్టర్…!

-

సల్మాన్ ఖాన్” బాలివుడ్ ని దాదాపు మూడు దశాబ్దాల నుంచి శాసిస్తున్న పేరు. భారత చలన చిత్ర పరిశ్రమలో ఆ పేరుకి ఉన్న బ్రాండ్ వేల్యూనే వేరు. అభిమానులకు ఏం కావాలో తెలుసు, ప్రేక్షకులు తన నుంచి ఏం కోరుకుంటారో తెలుసు, సినిమాకు తాను ఏం ఇవ్వాలో తెలుసు. అందుకే దాదాపు మూడు దశాబ్దాల నుంచి సల్మాన్ అనే పేరు భారతీయ సినిమాలో చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు సల్మాన్ వయసు 54 దాటి 55 లోకి వెళ్తుంది. కాని ఎంత మంది హీరోలు బాలివుడ్ లోకి అడుగుపెట్టినా అతని స్థాయిని మాత్రం అందుకోలేరు అనేది వాస్తవం.

 

సరిగా మూడేళ్ళ క్రితం వచ్చిన సుల్తాన్ సినిమాలో సల్మాన్ నటన చూసి బాలివుడ్ లో ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోయారు. కుస్తీ వీరుడిగా సల్మాన్ నటన ఆ సినిమాలో ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంది. ఇమేజ్ దిగి నటించడానికి ఇబ్బంది పడే ఎందరో నటులకు ఆ సినిమా స్పూర్తినిచ్చింది. అప్పటికే వసూళ్ళలో ఒక స్థాయిని చూసిన సల్మాన్ ఆ సినిమాతో తన స్థాయిని మరింత పెంచుకున్నాడనేది వాస్తవం. 5 పదుల వయసు దాటినా సరే కుర్ర హీరోలకు సల్మాన్ ఫిట్నెస్ ఆదర్శం. యువ హీరోలు కూడా ఆయన్ను చూసి కుళ్ళుకునే పరిస్థితి.

సినిమా సినిమాకు తనలో మార్పులు చేసుకునే అరుదైన నటుడు సల్మాన్. 2000వ దశకం ఆయనకు కలసి రాకపోయినా, 2010లో దబాంగ్ సినిమాతో మళ్ళీ హిట్ ల బాట పట్టారు సల్మాన్. ఆ తరువాత ఆయన నటించిన బాడీ గార్డ్ (2011), ఏక్ థా టైగర్ (2012), కిక్ (2014), బజరంగీ భాయీజాన్ (2015), సుల్తాన్ (2016) వంటి సినిమాలతో బాలీవుడ్ లోనే అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాలను అందించారు సల్మాన్. వరుసగా 9 ఏళ్ళ పాటు బాలీవుడ్ కు అత్యధిక వసూళ్ళు చేసిన సినిమాలు అందించిన ఏకైక నటుడు సల్మాన్.

బీయింగ్ హ్యూమన్ అనే సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సల్మాన్. అయుదు పదుల వయసు దాటినా సరే సల్మాన్ ఖాన్ ఇప్పటికి అమ్మాయిల కలల రాకుమారుడే. ఇప్పటికి పెళ్లి చేసుకొని సల్మాన్ ఖాన్ మీద అనేక రూమర్లు వచ్చాయి. అలాగే ఆయనను అనేక వివాదాలు వెంటాడాయి. రాజస్థాన్ లో కృష్ణ జింకలను వేటాడిన కేసు ఇప్పటికి ఆయన్ను వెంటాడుతూనే ఉంది. ఫుట్ పాత్ పై అయిదుగురిపై కారు పోనిచ్చిన కేసులతో ఆయన ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news