నేడు కేబినెట్ భేటీ నేఫథ్యంలో అమరావతిలో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించింది ప్రభుత్వం. దీంతో అమరావతిలోని 29 గ్రామాల్లో అప్రకటిత యుద్ధ వాతావరణం నెలకొంది. సచివాలయం చుట్టుపక్కల గ్రామాల్లో పోలీసు బలగాలు పెద్ద ఎత్తున దిగాయి. ఇదిలా ఉంటే.. కేశినేని నాని వర్సెస్ పీవీపీ.. విజయవాడ సెంటర్‌గా ట్వీట్ల యుద్ధం జరుగుతోంది. అయితే ఏపీ రాజధాని విషయంలో ప్రజల మాట వినాలే తప్ప, చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా మాట్లాడరాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత పీవీపీ, విజయవాడ ఎంపీ కేశినేని నాని టార్గెట్ గా సెటైర్లు వేశారు.
ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన పీవీపీ, “రోజమ్మ మొదలుకుని ఎందరో నాయకులని అణిచివేద్దామని, మీ చంద్రన్న చేయని ప్రయత్నం లేదు బ్రదరూ… ఆ సలహా ఏదో మీ బాస్ కి బాగా వర్తిస్తుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాభీష్టం మేరకు వారి రాజధాని ఉంటుంది. నువ్వు నేను అన్ని మూసుకొని ఆంధ్రులందరి మాట విందాం కేశినేని నాని” అని అన్నారు. పీవీపీ ట్వీట్ పై
నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.