హ.. హ.. హాసిని మళ్లీ వస్తుందా..!

-

సౌత్ సిని పరిశ్రమలో హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భామ జెనిలియా. తెలుగు, తమిళ భాషల్లో దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన జెనిలియా బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను ప్రేమించి పెళ్లాడింది. తేరే నాల్ లవ్ హోగయా సినిమాలో రితేష్ తో కలిసి నటించిన జెనిలియా ఇద్దరి అభిరుచులు కలవడంతో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్న జెనిలియా మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటుందట.

మ్యారేజ్ తర్వాత సినిమాలను పూర్తిగా ఆపేసిన జెనిలియా ఇప్పుడు సినిమాలకు సై అంటుందట. ముఖ్యంగా జెనిలియా సౌత్ సినిమాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుందట. తెలుగు, తమిళ భాషల్లో ఎలాంటి అవకాశాలు వచ్చినా చేసేందుకు సిద్ధమని చెబుతుందట. బొమ్మరిల్లు సినిమాలో హ.. హ.. హాసినిగా జెనిలియా చేసిన అల్లరి ఎవరు మర్చిపోలేరు.

రీ ఎంట్రీలో జెనిలియా హీరోయిన్ గా నటిస్తుందా లేక స్నేహలానే అక్క, వదిన పాత్రలతో సరిపెట్టుకుంటుందా అన్నది తెలియాల్సి ఉంది. రాం నుండి ఎన్.టి.ఆర్ వరకు స్టార్ హీరోలతో పాటుగా యువ హీరోలతో నటించిన జెనిలియా రీ ఎంట్రీ ఇస్తే ఆమె ఫ్యాన్స్ కు పండుగే అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version