ఏ ఆర్ రెహమాన్ భార్య ఎంత అందంగా ఉందో చూసారా..!

-

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సినీ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా అందరికీ సుపరిచితమైన ఏఆర్ రెహమాన్ వ్యక్తిగత జీవితం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈరోజు ఆయన పెళ్లిరోజు సందర్భంగా సతీమణితో ఉన్న ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.. తెలుగు, తమిళ్, హిందీ వంటి అనేక భాషల్లో సంగీతం అందించిన ఏ ఆర్ రెహమాన్ పేరు ఒక బ్రాండ్ అనే చెప్పాలి. దాదాపు 30 ఏళ్ల నుంచి సంగీత దర్శకుడిగా సినీ ఇండస్ట్రీని ఏలుతున్నారు. దేశంలోనే అగ్ర సంగీత దర్శకుడిగా పేరు సంపాదించుకున్న ఏఆర్ రెహమాన్.. ఇప్పటికే రెండుసార్లు ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. కాగా ఈరోజు ఏఆర్ రెహమాన్ పెళ్లి రోజు. 1995లో ఇదే రోజు సైరాబానూని వివాహం చేసుకున్నారు. వీరి దాంపత్య జీవితం 28 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన భార్యతో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ఈ పోస్ట్ లో రెహమాన్ భార్య ఎంతో అందంగా కనిపించారు. సాధారణంగా బయట ఫంక్షన్ లో కూడా ఎక్కువగా కనిపించని రెహమాన్ భార్యను ఈ పోస్ట్ లో చూసిన వారంతా ఇంత అందంగా ఉంటారా అంటూ ఆశ్చర్యపోతున్నారు.. కాగా ఈ దంపతులకు ఖతీజా రెహమాన్, రహీమ రెహమాన్‌ అనే ఇద్దరు కుమార్తెలు, ఒమీన్‌ అనే కొడుకు ఉన్నారు.. తాజాగా రెహమాన్ సంగీతాన్ని అందించిన పోన్నియన్ సెల్వం, తనిందది కాడు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం పత్తుతల, పొన్నియిన్‌ సెల్వన్‌ 2, మామన్నన్, లాల్‌ సలాం, ఆడుజీవితం వంటి పలు చిత్రాలు సంగీతాన్ని అందిస్తున్నారు.. ఈ చిత్రాల్లో శింబు కథానాయకుడుగా నటించిన పత్తుతల చిత్రం ఈనెల 30న విడుదల కాగా పుణ్యం సెల్వం ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధమవుతుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version