పిల్లల్ని కనడం 20 ఏళ్ల ప్రాజెక్టు.. వైరల్ అవుతున్న ఉపాసన మాటలు..

-

దాదాపు 10 ఏళ్ల నుంచి మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఒక గుడ్ న్యూస్ తాజాగా వచ్చేసింది. ఉపాసన రాంచరణ్ ఎప్పుడు పిల్లల్ని కంటారు అనే విషయం ఇప్పటివరకు పెద్ద చర్చనీయాంశంగా మారినా.. తాజాగా చిరంజీవి వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ ట్విట్టర్ వేదికగా తెలపడంతో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ విషయంపై గతంలో ఉపాసన ఏమన్నారంటే.

పెళ్లి జరిగి రెండు మూడు ఏళ్ళు అయితే ఎవరూ పెద్దగా పట్టించుకోరు.. కానీ 10 ఏళ్ళు పిల్లలకు కనకుండా ఉండటం పెద్ద చర్చకు దారి తీసింది. అయితే ఆరోగ్యపరమైన కారణాలు ఏమైనా ఉంటే ఉపాసన వెనుక పెద్ద అపోలో హాస్పిటల్ ఉంది. కెరియర్ లో సెటిల్ అవ్వాలి అనే బాధ కూడా లేకుండా ఆమెకు దోమగుండ సంస్థానం నుంచి కేవలం ఉపాసన వాటే పది వేల కోట్లు దాటి ఉంటుంది.. అలాంటప్పుడు ఉపాసన రాంచరణ్ పిల్లల్ని ఇన్నాళ్లు పోస్ట్ పోన్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఒకానొక సమయంలో ఉపాసన మాట్లాడిన మాటలు మరొకసారి గుర్తు చేసుకుంటున్నారు..

గతంలో ఉపాసనా.. ” తల్లి కావడం అనేది 20 ఏళ్ల ప్రాజెక్ట్. తల్లిదండ్రులు కావడానికి మానసికంగా, శారీరకంగా సిద్ధం కావాలి. ప్రపంచంలోకి మనం ఒక ప్రాణిని తీసుకురావడం అతి పెద్ద బాధ్యత. మన పిల్లలకు ఏం కావాలి? ఎలా పెంచాలి?… ఇలా అనేక విషయాల మీద అవగాహన ఉండాలి. అప్పుడు మాత్రమే మనం తల్లిదండ్రులు కావాలి. పిల్లలకు మంచి జీవితం ఇవ్వడానికి కావాల్సిన ఏర్పాట్లు, సన్నద్ధత తల్లిదండ్రులు కలిగి ఉండాలి. పూర్తి స్థాయిలో వారికి కావలసిన అన్ని ఏర్పాటు చేసి ఇవ్వగలం..” అంటూ చెప్పుకొచ్చారు.. దీనిని బట్టి ఉపాసన రాంచరణ్ ఇన్నాళ్లు ఎందుకు పిల్లల్ని పోస్ట్ పోన్ చేసుకున్నారు అందరికీ అర్థమవుతుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version