HBD Mahesh: మహేష్ బాబు గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

-

ప్రిన్స్ మహేష్ బాబు గా కెరియర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత సూపర్ స్టార్ గా తన తండ్రికి తగ్గ తనయుడిగా పేరు దక్కించుకున్న మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇక ఈరోజు ఆయన పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన గురించి చాలామందికి తెలియని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 1975 ఆగస్టు 9వ తేదీన మద్రాస్ లో జన్మించిన ఈయన.. పుట్టే నాటికి తండ్రి కృష్ణ సుమారుగా 100 సినిమాలకు పైగా పూర్తిచేసి ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఇక ఆరేళ్ల వయసులోనే మహేష్ బాబు తన అన్నయ్య రమేష్ బాబు తో కలిసి విజయవాడ వెళ్లగా.. అప్పట్లో దాసరి దర్శకత్వంలో నీడ అనే సినిమాను రమేష్ హీరోగా చేస్తున్నారు. అందులో ఒక కీలక పాత్ర కోసం మహేష్ బాబుకి తెలియకుండానే ఆయనపై దాసరి చిత్రీకరించడం జరిగింది.

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మహేష్ బాబు తర్వాత నాన్న కృష్ణతో పోరాటం సినిమాలో నటించి మెప్పించారు. ఇక స్కూల్ కి సెలవులు రాగానే షూటింగ్స్ లో పాల్గొనేవారు మహేష్ బాబు. అలా ముగ్గురు కొడుకులు , బజారు రౌడీ, కొడుకు దిద్దిన కాపురం, గూడచారి 117, వంటి సినిమాలు చేశారు. అయితే సినిమాల మీద ధ్యాసతో స్కూల్ కి వెళ్లడం మానేసిన మహేష్ బాబుకి చదువు ఎక్కడ పాడైపోతుందోనని భయపడిన కృష్ణ సినిమాలు వద్దని బుద్ధిగా చదువుకోవాలని చెప్పడంతో మళ్ళీ చదువుపై ఫోకస్ పెట్టారు మహేష్ బాబు.

అయితే పదవ తరగతిలో అనుకున్నన్ని మార్కులు రాకపోవడంతో తనకెంతో ఇష్టమైన లయోలా కాలేజీలో ఇంటర్ చదవడానికి అడ్మిషన్ రాలేదు . దాంతో డిగ్రీలో అయిన సీటు సంపాదించాలని ఇంటర్లో కష్టపడి చదివి ఆపై మంచి మార్కులు సాధించి అనుకున్నట్టుగానే లయోలా డిగ్రీ కాలేజ్ లో బీకాం సీటు సాధించారు మహేష్ బాబు. డిగ్రీ చదువుతున్న సమయంలోనే సినిమాలపైకి మనసు మల్లడంతో రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీ దత్ కాంబోలో రాజకుమారుడు సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు. ఇక అప్పటినుంచి ఎన్నో చిత్రాలకు హీరోగా నటించిన ఈయన నిర్మాతగా కూడా పనిచేశారు. అంతేకాదు 27 సినిమాలకు ఎనిమిది మంది అవార్డులను కూడా దక్కించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news