ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ కొత్త నిబంధనలు రూపొందిస్తోంది. శాసనసభలో సభ్యులు కొత్త నిబంధనల ప్రకారం నడుచుకోవాలని పేర్కొంది. ఇంతకీ ఆ నిబంధనలు ఏంటో తెలుసా..?
శాసనసభ్యులు సభలోకి తమ మొబైళ్లను తీసుకువెళ్లకూడదని, ఎలాంటి పత్రాల చించివేతకు పాల్పడకూడదని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. స్పీకర్‌కు ఎదురుగా వెనక్కి తిరిగి నిల్చోవడం, లేదా వెనక్కి తిరిగి కూర్చోవడానికి అనుమతించరాదని ప్రతిపాదిస్తున్నాయి. దీనిపై ఇవాళ యూపీ అసెంబ్లీలో చర్చ చేపట్టనున్నారు. సభ్యులు ప్రసంగిస్తున్నప్పుడు గ్యాలరీలోని ఎవరినీ వేలెత్తి చూపించకూడదని, సభలోకి ఎలాంటి ఆయుధాలు తీసుకుని రాకూడదని కొత్త రూల్స్ చెబుతున్నాయి.
లాబీల్లో బిగ్గరగా నవ్వడం వంటివి చేయకూడదని కొత్త నిబంధనల్లో ఉన్నాయి. లాబీల్లో పొగ తాగడంపైనా నిషేధాన్ని ప్రతిపాదించారు. ఎలాంటి ఆయుధాలను సభలోకి తీసుకువచ్చేందుకు అనుమతించరు. సమావేశాలను ఏర్పాటు చేయడానికి కనీసం 14 రోజుల సమయం ఉండాలనే ప్రస్తుత నిబంధనను వారం రోజులకు తగ్గిస్తున్నారు. సభ లోపలకు ఎలాంటి పుస్తకాలను తీసుకువెళ్లే వీలుండదు.