నితిన్ `భీష్మ`లో హెబ్బా పటేల్.. సినిమాకు ఈమె పాత్రనే హైలెట్‌..!

-

యంగ్ హీరో నితిన్, ఛలో ఫేమ్‌ వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘భీష్మ’. ‘సింగల్ ఫరెవర్’ అనేది క్యాప్షన్. మాంటిక్‌యాక్షన్‌ ఎంటర్‌టైనర్ గా రూపొందించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మాస్‌, క్లాస్‌, లవ్‌‌, రొమాన్స్‌ షేడ్స్‌ కనిపించేలా ఇప్ప‌టికే విడుదల చేసిన పోస్టర్లు నెటిజన్లను తీవ్రంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా విడుద‌లైన టీజ‌ర్ కూడా ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈ నెల 21వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమాలో మరో సర్‌ప్రైజ్ కూడా ఉందట. అదేంటంటే.. ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటించగా, మరో కథానాయికగా హెబ్బా పటేల్ కనిపించనుంది.

దీంతో ఈ సినిమాలో ఆమె పాత్ర ఏమై ఉంటుంది? అనే ఆసక్తి యూత్ లో నెలకొంది. అయితే ఈ సినిమాలో ఆమె ఏదో సాదా సీదా పాత్రలో కనిపించడం లేదట. కథను కీలకమైన మలుపు తిప్పే పాత్రలో ఆమె కనిపించనుందనేది తాజా సమాచారం. ఈ సినిమా హైలైట్స్ లో ఆమె పాత్ర ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఆమె కెరియర్ కి ఈ పాత్ర మంచి హెల్ప్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి, ఈ వార్త నిజమో, కాదో తెలియాలంటే మరో మూడ్రోజులు ఆగాల్సిందే. కాగా, ‘కుమారి 21F’ సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హెబ్బా.. ఆ తర్వాత‌ ఒకటి రెండు సినిమాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. అయితే కొంతకాలంగా వరుస పరాజయాలు పలకరిస్తూ ఉండటంతో రేస్ లో వెనుకబడిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version