దేవరకొండ దెబ్బకి దుకాణం సర్దుకున్న నిర్మాత…!!

-

రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ పరిస్థితి ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఏ మాతరం ఆశాజనకంగా లేదనే చెప్పాలి. హీరోగా నటించిన ఫస్ట్ సినిమా పెళ్లి చూపులుతో మంచి హిట్ అందుకున్న విజయ్, ఆపై సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి తో సూపర్ హిట్ అందుకుని, అని అనంతరం పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందం తో మరొక సూపర్ డూపర్ హిట్ కొట్టి యూత్ లో ఎంతో క్రేజ్ దక్కించుకున్నాడు. ఇక ఆ తరువాత నుండి విజయ్ నటిస్తున్న సినిమాలు వరుసగా పరాజయం పాలవుతూ వస్తున్నాయి.

ఇక ఇటీవల ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతం ఎంతో పేలవమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో ఆ సినిమా నిర్మాతలైన క్రియేటివ్ కమర్షియల్స్ వారికి లోలోపల సినిమా విషయమై భయం పట్టుకుందని అంటున్నారు. ఈ సినిమాని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లలో చాలా మంది బాగానే నష్టపోయే పరిస్థితులు స్పష్టంగా కన్పిస్తున్నాయని అంటున్నారు. దానితో వారు ఎప్పుడు తమ వద్దకు వచ్చి గట్టిగా అడుగుతారో అని లోలోపల నిర్మాతలు ఆందోళన చెందుతున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్.

 

ఇక ఇటీవల వారి బ్యానర్ లో వచ్చిన కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నిర్మాత కేఎస్ రామారావు, ఒక్కసారిగా ఈ సినిమాకు వస్తున్న నష్టాలను చూసి కొంత ఆలోచనలో పడ్డారట. మరి ఆయన దీనిపై ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో, బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లకు ఏ విధంగా నష్టాలు పూడుస్తారో చూడాలని అంటున్నారు. దీనితో విజయ్ ప్రస్తుతం నటిస్తున్న ఫైటర్ పై ఈ సినిమా ప్రభావం పడనుందని, అతడు తప్పనిసరిగా ఆ సినిమాతో కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు….!!

Read more RELATED
Recommended to you

Exit mobile version