తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు… నూతన సచివాలయానికి ఇవాళ మధ్యాహ్నం వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్… నూతన సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. సచివాలయ నిర్మాణ పనుల గురించి ఆర్ అండ్ బి అధికారులు, ఇంజనీర్లు.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు వివరించారు. అలాగే సచివాలయ నిర్మాణ పనుల పురోగతిని అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్.
ఏడు అంతస్తుల సచివాలయ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆరు అంతస్తుల స్లాబ్ పనులు పూర్తి కాగా… రాత్రింబవళ్లు మూడు షిఫ్టుల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సచివాలయ నిర్మాణ పనులను షాపూర్ జి పల్లోంజి కంపెనీ చేపట్టింది. కాగా సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ప్రశాంత్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ సోమేష్ కుమార్ తదితరులు ఉన్నారు.