పదేళ్ళ క్రితం తయారు చేసిన బర్గర్… ఇప్పటికీ తాజాగా ఉంది…!

-

ఈ రోజుల్లో ఆహార పదార్ధాలు వేగంగా పాడైపోతున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా, వంటల్లో వాడే పదార్ధాలలో కలుషితం కారణంగా అవి ఎక్కువ రోజులు నిలువ ఉండటం లేదు. దీనితో రెస్టారెంట్ల వాళ్ళు… తాము తయారు చేసే ఆహారానికి రసాయనాలు కలుపుతూ వ్యాపారం చేస్తున్నారు. ఇక పాడైపోయిన ఆహారాన్ని సైతం… వాళ్ళు వినియోగదారులకు విక్రయించడానికి రసాయనాలు వాడటం, వేడి చేసి ఇవ్వడం చేస్తున్నారు. దీనితో వాటిని కొని తినే వాళ్ళు అనారోగ్యానికి గురి కావడం జరుగుతూ ఉంది.

అయితే ఒక బర్గర్ మాత్రం పదేళ్ళ నుంచి పాడవకుండా అలాగే ఉంది. ఏంటి నమ్మరా…? నిజం అండి బాబూ… ప్రముఖ మెక్‌డొనాల్డ్ కంపెనీ ఐస్‌లాండ్‌లో 2009లో కంపెనీ తన చివరి అవుట్‌లెట్‌ను ఆపేసింది. అదే ప్రాంతానికి చెందిన హిజోర్టర్ స్మెర్సెన్ పదేళ్ల క్రితం మెక్‌డొనాల్డ్ అవుట్ లేట్ ని మూసేస్తున్నారు అని తెలుసుకుని చివరిసారిగా బర్గర్ ఆర్డర్ చేసాడు. అయితే ఆ బర్గర్ ని మాత్రం అతను తినకుండా మెక్ డోనాల్డ్ గుర్తుగా అలాగే ఉంచుకున్నాడు. మొదట్లో తన దగ్గరే ఉంచుకున్నా తర్వాత మాత్రం దానిని ఒక మ్యూజియం కి అప్పగించాడు.

ఇప్పుడు దానిని అక్కడి నుంచి ఒక ప్రముఖ హోటల్ కి మార్చగా దానికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. దానిని వీక్షించేందుకు అక్కడికి భారీగా జనం రావడమే కాదు… సోషల్ మీడియాలో కూడా అది ఒక ట్రెండి౦గ్ అయిపోయింది. పదేళ్ళు అయినా ఇలా ఎలా ఉందీ అంటూ పలువురు ఆశ్చర్యపోతున్నారు. ఇక ఆ బర్గర్ తో పలువురు సేల్ఫీలు దిగడం కూడా ఆశ్చర్యపరుస్తుంది. మాయిశ్చర్ ఏమాత్రం లేనందునే ఆ బర్గర్ తాజాగా ఉందని నిపుణులు చెప్తున్నారు. ఏది ఎలా ఉన్నా ఒక బర్గర్ పదేళ్ళ పాటు నిల్వ ఉండటం అనేది నిజంగా ఆశ్చర్యమే కదూ…?

Read more RELATED
Recommended to you

Exit mobile version