తమిళ స్టార్ హీరో అజిత్ కేరీర్ లో మొదటి సారి చేస్తున్న పాన్ ఇండియా సినిమా వలిమైని సంక్రాంతి బరిలో ఉండనుంది. ఈ విషయాన్ని టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్య ప్రకటించాడు. దానికి సంబంధించిన పోస్టర్ ను కూడా నాగ చైతన్య విడుదల చేశాడు. ఈ సినిమా పాన్ ఇండియా రెంజ్ లో ఈ నెల 13న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. జనవరి 13న తమిళ్ తో పాటు తెలుగు, హిందీ భాషాలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. కాగ అజిత్ వలిమై సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు.
అలాగే టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ మరో సారి ప్రతి నాయకుడిగా కనిపిస్తున్నాడు. గతంలో నాని హీరో గా వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాలో కార్తికేయ విలన్ పాత్రలో నటించాడు. అలాగే ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు. కాగ ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదల అయింది. ఈ ట్రైలర్ తమిళ్ తోపాటు తెలుగు లో కూడా మంచి స్పందన వచ్చింది. కాగ తమిళ్ స్టార్ హీరో అజిత్ కు తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ కారణంతోనే వలిమై సినిమాను తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఒకేసారి విడుదల చేస్తున్నారు.
My absolute pleasure to launch the Telugu poster of #AjithKumar sir’s #Valimai being a huge fan myself! wishing the team all the very best @BoneyKapoor #HVinoth @thisisysr @BayViewProjOffl @ZeeStudios_ @sureshchandraa @ActorKartikeya #NiravShah @humasqureshi #ValimaiFromPongal pic.twitter.com/pDUsz6d2oM
— chaitanya akkineni (@chay_akkineni) January 4, 2022