నేడు పంజాబ్ లో ప్రధాని మోదీ పర్యటన… రైతు ఉద్యమం తర్వాత తొలిసారి పంజాబ్ వెళ్లనున్న ప్రధాని

-

రైతు ఉద్యమం తరువాత మొదటిసారిగా నేడు పంజాబ్ లో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. పలు డెవలప్మెంట్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పంజాబ్ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ప్రధాన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో ఆయన పర్యటించనున్నారు. దాదాపుగా రూ. 42750 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఢిల్లీ-అమృతసర్-కత్రా ఎక్స్‌ప్రెస్ వే, కపుర్తలా, హెషియార్పూర్ లతో రెండు కొత్త మెడికల్ కాలేజీలకు మొదలైన వాటికి శంకుస్థాపన చేయనున్నారు.

ఇదిలా ఉంటే దాదాపుగా ఏడాది కన్నా ఎక్కువ కాలం తరువాత పంజాబ్లో మోదీ పర్యటించనున్నారు. ముఖ్యంగా రైతు ఉద్యమం పూర్తయిన తర్వాత పంజాబ్ రాష్ట్రంలో పర్యటన జరుగుతోంది. దీంతో పాటు ఫిబ్రవరి- మార్చి నెలల్లో పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. దీంతో అక్కడ ఎన్నికల ప్రచారం కూడా చేయనున్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఇప్పటికే బీజేపీ, అమరిందర్ సింగ్ కొత్త పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఇప్పటికే ప్రధాని ఎన్నికలు జరుగనున్న ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి సభలు నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news