తెలంగాణా విద్యార్థులకు శుభవార్త.. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. జూన్ 12వ తేదీన పాఠశాలు తిరిగి తెరుచుకుంటాయని విద్యాశాఖ పేర్కొంది.

అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు తెలిపింది. ఈ నిబంధనలు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లకు వర్తిస్తాయని, అన్నీ స్కూళ్లు ఈ ఆదేశాలు పాటించాలని స్పష్టం చేసింది. ఇంటర్ కాలేజీలకు జూన్ 1వ తేదీ వరకు సమ్మర్ హాలిడేస్ ఉండనున్నాయి.
ఇది ఇలా ఉండగా ఇప్పటికే… తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి. వాళ్ళందరూ సమ్మర్ హాలిడేస్ లో ఉన్నారు. ఇక ఇంటర్ పరీక్ష ఫలితాలు… ఈ నెల చివర్లో విడుదల కానున్నాయి. ఏప్రిల్ 25 లేదా ఏప్రిల్ 27వ తేదీ న ఇంటర్ పరీక్షలు రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్.