బాలయ్య బాబు డేరింగ్ అండ్ డాషింగ్ ఇందుకే.!

-

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు నటించిన తాజా చిత్రం వీర సింహారెడ్డి. ఈ సినిమా తాజాగా జనవరి 12న విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల అయి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఎక్కడా చూసినా బాలయ్య సినిమా గురించే చర్చ నడుస్తోంది. మొదటి రోజు నుండే వసూళ్ళు కూడా అనుకున్నట్టే అదరగొట్టాయి.

ఇక సినిమాలోని పాటలు సన్నివేశాలు, డైలాగ్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి అని ఫ్యాన్స్ గోల గోల చేస్తున్నారు. మరో వైపు ఈ సినిమా లోని డైలాగ్స్ పై ప్రభుత్వం కూడా ఒక కన్ను వేసింది. ఇది కలకలం రేపింది. ఇక ఈ సినిమా వసూళ్ళు చూసుకుంటే కొద్దిగా చిరంజీవి సినిమా ఉండటం వల్ల కొంచం తగ్గిపోయాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే 100 కోట్లు వసూళ్లు సాధించి 150 కోట్లకు పరిగెడుతోంది.

ఇక తాజాగా వీర సింహారెడ్డి సినిమా విజయోత్సవ వేడుక కన్నుల పండువగా జరిగింది. ఈ సినిమా వేడుక లో ఎప్పటిలాగే బాలయ్య స్పీచ్ అదిరింది. ఇక ఆయన మరో సారి  సింగర్స్ తో కలిసి గొంతు సవరించారు. గతంలో ఆయన పాడిన పాటల పై ఇప్పటికీ మీమ్స్ వస్తూనే ఉంటాయి. అయినా కూడా బాలయ్య ఫ్యాన్స్ ను ఎంజాయ్ చేపించాడానికి ఎక్కడా తగ్గకుండా పాట పాడారు. తనతో వుండే సీనియర్స్ చిరు, వెంకి, నాగార్జున ఇంత సందడిగా ఉండరు. కాని బాలయ్య మాత్రం డేరింగ్ అండ్ డాషింగ్ గా తాను అనుకున్నది మాత్రం చేస్తూ వెళుతూనే ఉంటారు. దటీజ్ బాలయ్య

Read more RELATED
Recommended to you

Exit mobile version