సూపర్‌స్టార్‌ విరాళం కోటి…!

-

కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గానూ ప్రతీ ఒక్కరు ముందుకి వస్తున్నారు. తమ వంతు సహాయం అందిస్తున్నారు. ఎక్కడా కూడా ప్రజలు బయటకు రావొద్దని కోరుతున్నారు. ఇక కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి తమ వంతు ఆర్ధిక సహాయం ప్రకటిస్తున్నారు పలువురు. సినీ రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ఇప్పుడు కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి గానూ తమ వంతు సాయం ప్రకటిస్తున్నారు.

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, రామ్ చరణ్, వీవి వినాయక్ ఇలా అందరూ కూడా సహాయం చేయడానికి ముందుకి వచ్చారు. పవన్ కళ్యాణ్ రెండు కోట్ల రూపాయల భారీ సాయం ప్రకటించాడు. తాజాగా మహేష్ బాబు కూడా తన వంతు సహాయం ప్రకటించాడు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఏకంగా కోటి రూపాయల విరాళం ఇచ్చాడు మహేష్. వైరస్ అరికట్టడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు భేష్ అన్నాడు.

ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఇంట్లో నుంచి బయటకు రావొద్దని ఆయన కోరారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దన్నాడు. అందరూ ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవాలన్నాడు. 21 రోజులు ఇంట్లోనే ఉండాలని కోరాడు. అందరూ లాక్ డౌన్ రూల్స్ పాటిద్దామన్నాడు. మానవత్వం గెలుస్తుందని, కచ్చితంగా ఈ యుద్ధంలో మనం విజయం సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేసాడు మహేష్ బాబు .

Read more RELATED
Recommended to you

Latest news