తెలంగాణాలో డాక్టర్లకు కరోనా వైరస్…!

-

తెలంగాణాలో కరోనా వైరస్ క్రమంగా పెరుగుతుంది. వైరస్ వేగంగా విస్తరించడం తో తెలంగాణాలో ఇప్పుడు అలజడి మొదలయింది. ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకున్నా సరే అది మాత్రం కట్టడి అయ్యే పరిస్థితి కనపడటం లేదు అనేది వాస్తవం. తాజాగా ఇద్దరు వైద్యులకు కరోనా వైరస్ సోకింది. వైద్యం చేసే డాక్టర్లకు కరోనా సోకడం తో ఒక్కసారిగా తెలంగాణాలో అలజడి మొదలయింది.

తొలిసారిగా ఇద్దరు వైద్యులతో పాటు మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌ గా తేలిందని ప్రభుత్వం ప్రకటించింది. కుత్బుల్లాపూర్‌కి చెందిన 49 ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. అతనితో పాటుగా దోమలగూడలో భార్యాభర్తలైన ఇద్దరు వైద్యుల నమూనాలు పరీక్షిస్తే కరోనా పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు మీడియాకు వివరించారు. కుత్బుల్లాపూర్‌కి చెందిన వ్యక్తి ఇటీవల దేశ రాజధాని ఢిల్లీ నుంచి వచ్చారు.

కరోనా సోకిన వ్యక్తితో కలిసి ఉండటంతో అతనికి కరోనా వచ్చిందని వైద్యులు వివరించారు. దోమలగూడలో 43 ఏళ్ల వైద్యుడికి కరోనా సోకగా వైద్యురాలిగా ఉన్న ఆయన భార్యకు కరోన వైరస్ సోకింది. తెలంగాణాలో కరోనా కేసులు 44 కి చేరుకున్నాయి. అయితే ఎవరి ఆరోగ్య పరిస్థితి విషమంగా లేకపోవడం తో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news