మ‌రోసారి విల‌న్ పాత్ర‌లో హీరో నాని!

-

నేచుర‌ల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరో నాని ఏ పాత్రను అయిన త‌న‌కు అనుకూలంగా మార్చుకుంటాడు. హీరోగానే కాకుండా కామెడీ ట‌చ్ ఇస్తూ కామెడియన్ గా కూడా కొన్ని సార్లు గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే కాకుండా ఈ మ‌ధ్య కాలంలో హీరో నాని కాస్త భిన్నంగా ఆలోచిస్తున్నాడు. హీరో పాత్ర‌లే కాకుండా ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌ల‌ను పోషించ‌డానికి నాని ముందుకు వ‌స్తున్నాడు. ఇప్ప‌టికే జెంటిల్ మెన్, వీ వంటి సినిమాల‌లో విల‌న్ పాత్ర‌లు చేసి తెలుగు ప్రేక్ష‌కుల నుంచి ఆదార‌ణ పొందాడు.

తాజా గా హీరో నాని మ‌రోసారి విల‌న్ పాత్ర‌లో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. హీరో నాని ప్ర‌స్తుతం వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం అంటే సుంద‌రానికి అనే సినిమా తో పాటు శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో ద‌స‌రా అనే సినిమా ల‌లో న‌టిస్తున్నాడు. కాగ శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న‌ ద‌స‌రా సినిమాలో నాని కాస్త భిన్న మైన లుక్ తో పాటు నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ని స‌మాచారం.

 

ఈ సినిమాలో నాని లుక్ చాలా డిఫ‌రెంట్ గా ఉంటుంద‌ని టాక్. గ‌తంలో ఇలాంటి లుక్ లో నాని ఎప్పుడు క‌నిపించ‌లేద‌ని అలాంటి పాత్రను నానికి డైరెక్ట‌ర్ శ్రీ కాంత్ ఓదెల డిజైన్ చేశాడ‌ని తెలుస్తుంది. కాగ దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. కానీ దీని త్వ‌ర‌లోనే చిత్ర బృందం అధికారిక ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news