బరువు తగ్గాలనుకుంటే వీటిని తీసుకోండి..!

-

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. అలానే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు. అయితే బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే మంచిది. మరి ఇక ఆలస్యం ఎందుకు వాటికోసమే ఇప్పుడు చూద్దాం.

ఆపిల్:

ఆపిల్ లో విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. అలానే ఇతర పోషక పదార్ధాలు కూడా ఉంటాయి. ఆపిల్ తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది.

అరటి పండ్లు:

అరటి పండ్లలో ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి కూడా. అయితే ఒకేసారి ఎక్కువ అరటిపండ్లు తినకండి. ఎక్కువ అరటి పండ్లు తీసుకోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తుంది. కాబట్టి లిమిట్ గా తీసుకోవడం మంచిది.

స్ట్రాబెర్రీ:

స్ట్రాబెర్రీ లలో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. విటమిన్ సి కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇతర పోషక పదార్ధాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇతర లాభాలను కూడా పొందొచ్చు.

ఓట్స్:

ఓట్స్ లో కొలెస్టరాల్ తక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. అలానే ఓట్స్ తీసుకుంటే బరువు తగ్గొచ్చు కూడా.

బాదం:

బాదంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది బరువు తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదా వీటిని తీసుకుంటే ఎలా ఈజీగా బరువు తగ్గచ్చో.. మరి వాటిని డైట్ లో తీసుకుని బరువు తగ్గి ఆరోగ్యంగా వుండండి.

Read more RELATED
Recommended to you

Latest news