తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో నిఖిల్‌

-

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలో తాను తండ్రి కాబోతున్నానని తీపి వార్తను పంచుకున్నాడు. తన భార్య సీమంతానికి సంబంధించిన ఫొటోను సోషల్‌ మీడియా వేదికగా పోస్టు చేసి ఎమోషన్ క్యాప్షన్ రాసుకొచ్చాడు. ‘‘త్వరలోనే మేము తల్లిదండ్రులం కాబోతున్నాం. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు పల్లవి, నేను చాలా సంతోష పడుతున్నాం. మీ ఆశీస్సులు కావాలి’’ అంటూ నిఖిల్‌ పోస్టు పెట్టాడు.

ఈ పోస్టు కింద నెటిజన్లు కంగ్రాట్స్ నిఖిల్, వావ్ కార్తికేయ, ఆల్ ది బెస్ట్ హీరో, వెల్కమ్ టూ పేరెంట్హుడ్ అంటూ కామెంట్లు పెట్టారు. చాలా హ్యాపీగా ఉందంటూ నిఖిల్ ఫ్యాన్స్ తెగ ఖుష్ అయిపోతున్నారు. ఇక నిఖిల్ 2020లో దగ్గరి బంధువుల సమక్షంలో తను ప్రేమించిన డాక్టర్‌ పల్లవి వర్మను వివాహమాడిన విషయం తెలిసిందే. కరోనా లాక్డౌన్ వల్ల వీరి పెళ్లి చాలా సింపుల్గా జరిగిపోయింది. ఇక ఇటీవలే కార్తికేయ-2, స్పైతో హిట్ అందుకున్న నిఖిల్ ప్రస్తుతం భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో ‘స్వయంభూ’లో నటిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news