సోషల్ మీడియాలో రకుల్ చేస్తున్న హంగామా తెలిసిందే. భగత్ అనే వ్యక్తి రకుల్ పై అసభ్యకరమైన కామెంట్ చేయగా దానికి అంతే ధీటుగా బదులు ఇచ్చింది భగత్. రకుల్ ను అతను ఏవిధంగా పోల్చాడో భగత్ తల్లిని రకుల్ అదే విధంగా ప్రస్థావించింది. అయితే ఈ వివాదంలోకి అతని తల్లిని ఎందుకు లాగుతున్నావంటూ నెటిజెన్లు రివర్స్ లో రకుల్ పై ఫైర్ అవుతున్నారు. సిక్ మైండ్ పీపుల్ కు ఇలాంటి సమాధానమే ఇవ్వాలంటూ రకుల్ తను పెట్టిన కామెంట్ పై వెనక్కి తగ్గలేదు.
ఈ వ్యవహారం కాస్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా రకుల్ కు మద్ధతుగా నిలిచాడు హీరో కం డైరక్టర్ రాహుల్ రవింద్రన్. అందాల రాక్షిసి సినిమాతో హీరోగా పరిచయమై ఈమధ్యనే చిలసౌ సినిమాతో దర్శకుడిగా లక్ టెస్ట్ చేసుకున్న రాహుల్ రకుల్ స్పీక్ అప్ లైక్ రకుల్ అంటూ కామెంట్ పెట్టాడు. హీరోయిన్స్ అంటే ప్రతి ఒక్కరికి చులకన భావం ఏర్పడింది. నెటిజెన్లు కూడా అతను చేసిన కామెంట్స్ గురించి ఆలోచించకుండా రకుల్ ఇచ్చిన రెస్పాన్స్ మీద పడి నానా రచ్చ చేయడం ఎంతవరకు కరెక్టో వారికే తెలియాలి. ఫైనల్ గా ఈ వ్యవహారం మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాను వేడెక్కేలా చేసింది.
?????? Speak up like Rakul. https://t.co/dd2oDkzQOP
— Rahul Ravindran (@23_rahulr) January 17, 2019