నారప్ప, ఆ రోజులను గుర్తు చేసిన వెంకటేష్…!

-

టాలివుడ్ అగ్ర హీరోల్లో విక్టరి వెంకటేష్ ది ఒక ప్రత్యేక శైలి. తనకంటూ ఉన్న ఒక ప్రత్యేక గుర్తింపుని కాపాడుకుంటూ ఎలా పడితే అలా సినిమాలు చేసేయకుండా మంచి కథలు ఎంచుకుని ప్రేక్షకులను అలరిస్తున్నాడు వెంకటేష్. గత ఏడాది ఎఫ్2, వెంకి మామ చిత్రాలతో మంచి హిట్లు కొట్టిన వెంకటేష్, ఈ ఏడాది భిన్నమైన సినిమా చేయడానికి సిద్దమయ్యాడు. తమిళంలో ధనుశ్ హీరోగా నటించిన సూపర్ హిట్ ‘అసురన్’ రీమేక్‌ను చేస్తున్నాడు.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో కలైపులి ఎస్.థానుతో కలిసి సురేష్ బాబు ఈ సినిమాను తెలుగులో రూపొందిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పూజా కార్యక్రమాలతో బుధవారం నుంచి షూటింగ్ మొదలుకానుంది. నేటి నుంచి 3 వారాల పాటు ఫస్ట్ షెడ్యూల్‌ షూటింగ్ ఉంటుంది. ఇక ఈ చిత్రానికి ‘నారప్ప’ అనే రాయలసీమ స్టైల్ లో టైటిల్ ఖరారు చేసారు. రాయలసీమలోని అనంతపురం జిల్లా నేపథ్యంలో ఈ సినిమా రానుంది.

ఈ సినిమాలో వెంకటేష్ లుక్ ని విడుదల చేయగా చేతిలో బరిసతో, తలకు పాగాతో వెంకటేష్ లుక్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. రాయలసీమ ఫ్యాక్షన్ రోజులను గుర్తు చేసే విధంగా లుక్ ఉందని కామెంట్ చేస్తున్నారు. తమిళంలో ధనుశ్ ద్విపాత్రాభినయం చేయగా తెలుగులో మాత్రం వెంకటేష్‌తో పాటు రానాను తీసుకోనున్నారు. కులాల గొడవల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news