10th, 12th టాపర్స్ కు రూ.10 వేలు ప్రకటించిన హీరో విజయ్‌

-

10th, 12th టాపర్స్ తో హీరో విజయ్ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా టాపర్స్ అయినా విద్యార్థులకు పదివేలు బహుమానం గా ఇచ్చారు విజయ్. అనంతరం హీరో విజయ్ మాట్లాడుతూ…. ఇలాంటి ఒక సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఒక సినిమా డైలాగ్ అన్నారు.

అలాగే, ధనుష్ హీరోగా నటించిన ఆసురన్ సినిమాలోని డైలాగ్ చెప్పినా విజయ్…. మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు.. డబ్బు ఉంటే లాగేసుకుంటారు.. కానీ చదువు ఒక్కటి మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరన్నారు. ఈ డైలాగ్ నన్ను బాగా ఆలోచించేలా చేసింది … బాగా బాధ పెట్టింది..అ డైలాగ్ మిమ్మల్ని కలిసేలా ఇలాంటి సమావేశం నిర్వహించేలా చేసిందని వివరించారు విజయ్‌. నేను పుస్తకప్రియుడ్ని కాదని… కానీ ఈ మధ్య బాగా పుస్తకాలు చదువుతున్నానన్నారు.

విద్యార్థులు బాగా పుస్తకాలు చదవడం నేర్చుకోవాలి .. అంబేద్కర్, పెరియార్ మరియు కామరాజర్ గురించి తెలుసుకోవాలని… పరీక్షల్లో మార్కులు బాగా తెచ్చుకొని విద్యార్థులకు అండగా నిలబడాలి …వారు బాగా రాయడానికి,పాస్ అవ్వడానికి మీరు సహకరించండని తెలిపారు. మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి సమాజంలోని కొందరు వ్యక్తులు ఎప్పుడూ పక్కనే ఉంటారు.. వారిని పట్టించుకోకండి.. జీవితంలో వ్యక్తిత్వం చాలా ముఖ్యమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news