కరోనా వస్తుంటే భర్తతో తిరుగుతున్న హీరోయిన్…!

547

బిగ్ బాస్ భామ పూజా రామచంద్రన్ ఎప్పుడూ అందరికంటే తను ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఎవరు ఏం అనుకున్న తన పని తాను చేసుకుపోతుంది పూజా రామచంద్రన్. తెలుగులో లవ్ ఫెయిల్యూర్, స్వామి రారా, అడవి కాచిన వెన్నెల, దోచెయ్, త్రిపుర, కృష్ణార్జున యుద్ధం, వెంకీ మామ వంటి సినిమాల్లో పూజా రామచంద్రన్ నటించినప్పటికీ కూడా ఈమెకు సరైన గుర్తింపు రాలేదు. ఈమె నటించిన తెలుగు సినిమాలు తక్కువే అయినప్పటికీ పూజా మాత్రం చాలా ఫేమస్ అని చెప్పాలి.

ఎలా అంటారా సోషల్ మీడియా లో తన జిమ్ బాడీ ఫొటోస్ తనకు అంత క్రేజ్ తెచ్చిపెట్టాయి. అయితే ప్రపంచం మొత్తం కరోనా భయం తో వణికిపోతుంటే ఈమె మాత్రం తన భర్త తో కలిసి విదేశీ టూర్ నీ ఎంజాయ్ చేస్తుంది. తన భర్త జాన్ కక్కర్‌తో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకోడానికి మాల్దీవ్స్ వెళ్లింది పూజా రామచంద్రన్. అయితే ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచం లో పలు దేశాలు, ప్రజలు కరోనా కు భయపడి లాక్ డౌన్ ప్రకటించి కరోనా ను అరికట్టడానికి కృషి చేస్తుంటే ఇప్పుడు ఈమె ఇలా విదేశాలకు వెళ్ళడం ఏంటి అని పలువురు విమర్శిస్తున్నారు.

సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని గొంతు ఎండిపోయేలా అందరూ చెపుతుంటే ఈమె ఇలా భద్యతా రాహిత్యం గా ప్రవర్తించడం ఎంటి అని అంటున్నారు. పూజా రామచంద్రన్ బర్త్ డే పార్టీ ఫోటోలను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోల్లో ఆమె భర్త పక్కన బికినీతో ఉంది. ఈ ఫోటోలు చూసి నెటిజన్లు. దేశమంతా కరోనా ఉంటే ఇప్పుడు వీరికి రొమాన్స్ కావాలా అని అంటున్నారు.

విదేశాల్లో షికార్లు చేసి ఇండియాకు వస్తే కాళ్లు విరగ్గొడతాం అంటూ కామెంట్లు పెడుతున్నారు. మీరు విదేశాలకు వెళ్లి కరోనా అంటించుకు వచ్చి ఇక్కడ వారికి కూడా అంటిస్తారా అని అందరూ పూజ ను దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదంతా ఊహించని పూజా రామచంద్రన్ సోషల్ మీడియా లో ఈ సమయంలో తన విదేశీ టూర్ కి సంబంధించి వస్తున్న ఇటువంటి కామెంట్లు చూసి భయపడుతుంది.