రాజకీయాల్లోకి స్టార్ హీరోయిన్, తండ్రి బాటలోనే…!

-

శ్రుతీ హాసన్’ పెద్దగా సినిమాలు చేసినవి లేకపోయినా సరే ఈమె గారికి మాత్రం ఎప్పుడు ప్రాధాన్యత ఉంటుంది. మరి తన తండ్రికి ఉన్న స్టార్ ఇమేజ్ వలనో ఏమో గాని ఈమెకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో కూడా జనం, ఈమె ఎం చేస్తుంది అనే దాని మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తెలుగు, తమిళంతో పాటుగా బాలివుడ్ లో కూడా కాస్త ఒక మెరుపు మెరిసిన ఈ భామ, ఇప్పుడు 2020లో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి,

బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తుంది శ్రుతీ. రవితేజ హీరోగా వస్తున్న క్రాక్‌లో హీరోయిన్‌గా కమిటైంది శృతి హాసన్. ఈ సినిమాతో పాటు తమిళనాట వరస కథలు వింటుంది కూడా. ప్రేమ పేరుతో సమయం వృధా చేసుకున్నా అనుకుందో ఏమో గాని ఇప్పుడు మాత్రం విడిపోయాక వరుస సినిమాలు చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ తరుణంలోనే ఆమె రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది.

తన తండ్రి పార్టీ అయిన మక్కల్ నీది మయ్యం ద్వారా రాజకీయ అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ మధ్య బయట వేడుకలకు ఎక్కువగా వస్తున్న శ్రుతీని మీరు కూడా తండ్రి బాటలోనే వెళ్తారా అంటే మరో అనుమానం లేకుండా తన తండ్రికి మద్దతు ఎప్పుడూ ఉంటుందని, తన తండ్రి కమల్ పార్టీకి ఎప్పుడూ మద్దతు తెలుపుతూ ఉంటానని, అయితే తాను పొలిటికల్ ఎంట్రీ ఇస్తానా లేదా అనేది ఇప్పుడు చెప్పలేనని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version