హాస్పిటల్ లో హీరోయిన్.. పరిస్థితి విషమం..!

-

సినిమా ప్రపంచం అనేది ఎంత కలర్ ఫుల్ గా ఉంటుందో ఇక్కడకు వచ్చాక కష్టాలు కూడా అదేలా ఉంటాయి. వేల మంది ఇండస్ట్రీపై ఎన్నో ఆశలతో వస్తే ఇక్కడ క్లిక్ అయ్యేది మాత్రం వేళ్ల మీద లెక్కబెట్టుకునేలా ఉంటారు. ఇక సినిమా కష్టాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని కూడా లేదు. ఫాం లో ఉంటే కోట్లకు కోట్లు ఇచ్చి సినిమాలు చేస్తారు ఫేడవుట్ అయితే కనీసం వారి వంక కూడా చూడరు. వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవడం కూడా తెలియాల్సిందే.

ఇదిలాఉంటే కన్నడ భామ విజయలక్ష్మి ప్రస్తుతం హాస్పిటల్ లో దయనీయమైన పరిస్థితుల్లో ఉందని తెలుస్తుంది. హనుమాన్ జంక్షన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న విజయలక్ష్మి కన్నడలో పలు సినిమాలు చేసింది. అయినా సరే ఆమె ఆర్ధికంగా బలపడలేదు. ఇక తన తల్లికి వచ్చిన జబ్బు వల్ల ఉన్నదంతా హాస్పిటల్ కే ఖర్చు పెట్టిందట. అయితే ఇప్పుడు ఆమె కూడా అనారోగ్యంతో బాధపడుతుందట.

తల్లి, సోదరి ఆరోగ్యం బాగాలేదని సహాయం చేయాల్సిందిగా కోరుతున్నారు విజయ లక్ష్మి సోదరి ఉషాదేవి. అయితే విషయం తెలుసుకున్న కన్నడ సిని పరిశ్రమ పెద్దలు కొందరు విజయ లక్ష్మి హాస్పిటల్ ఖర్చు భరిస్తామని హామీ ఇచ్చారట. విజయలక్ష్మి పరిస్థితి చూసిన కొందరు సినితారలు తమ పరిస్థితి ఇలా అవకూడదని జాగ్రత్త పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news