శంకర్, చరణ్ సినిమాలో హాలీవుడ్ స్టార్..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ RRR, ఆచార్య తర్వాత క్రేజీ కాంబోని సెట్ చేసుకున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో సౌత్ స్టార్ డైరక్టర్ శంకర్ డైరక్షన్ లో ఈ సినిమా వస్తుంది. రాం చరణ్ ఇమేజ్ కు తగినట్టుగా పాన్ ఇండియా వైడ్ మెప్పించే కథతో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ మెగా ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. హాలీవుడ్ స్టార్ మైఖెల్ మ్యాడ్ చరణ్ సినిమాలో ఛాన్స్ అందుకున్నాడట.

Hollywood Star in Shankar Ram Charan movie

ఆల్రెడీ అనుష్క నిశ్శబ్ధం సినిమాలో విలన్ గా నటించిన మైఖెల్ మ్యాడ్ మరోసారి తెలుగు సినిమా ఛాన్స్ అందుకున్నాడు. శంకర్ ఇండియన్ 2 సినిమా పూర్తి చేసి చరణ్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళాడని తెలుస్తుంది. ఈ సినిమాలో ఇంకా మరెన్నో సర్ ప్రైజులు ఉంటాయని తెలుస్తుంది. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి కూడా శంకర్, చరణ్ కాంబో మూవీలో ఉంటారని టాక్ వచ్చింది. అదే నిజమైతే ఈ ప్రాజెక్ట్ మరో భారీ సినిమాగా ఏర్పడుతుందని చెప్పొచ్చు.