సాయి పల్లవి క్రేజ్ తో విరాటపర్వం మొదటి రోజు ఎంత కలెక్షన్ చేసిందంటే..!!

-

తాజాగా సాయి పల్లవి, రానా కలిసి నటించిన చిత్రం విరాటపర్వం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వేణు దర్శకత్వంలో డి.సురేష్ బాబు నిర్మాత గా వ్యవహరించారు. ఎట్టకేలకు ఈ చిత్రం నిన్నటి రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అయితే ఈ సినిమాపై అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. మరి ఈ చిత్రం మొదటిరోజు ఎంతటి కలెక్షన్లను చేసిందో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.

విరాటపర్వం చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే .. రూ.11 కోట్లకు మేరకు రూ.3 కోట్ల బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది . ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాలలో కలుపుకొని కోటి రూపాయల బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ఓవర్సీస్లో రూ.2 రెండు కోట్ల మేరకు బిజినెస్ జరిగింది. దీంతో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. రూ.14 కోట్ల రూపాయల వరకు జరగగా.. ఈ చిత్రం సక్సెస్ కావాలి అంటే. రూ.14.5 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది.

రెండు తెలుగు రాష్ట్రాల లో కూడా ఈ విరాటపర్వం చిత్రానికి భారీ స్పందన వచ్చినట్లు కనిపిస్తోంది . ఈ చిత్రం సాయంత్రం వరకు హైదరాబాదులో రూ.32 లక్షలు, వరంగల్ లో రూ. 4 లక్షలు, విజయవాడ లో రూ.2.50 లక్షలు వసూలు చేయగా.. దీంతో తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా 60 లక్షల రూపాయలకు పైగా అడ్వాన్స్ బుకింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక కర్ణాటక, తమిళనాడులో బాగానే ఈ సినిమా కనెక్ట్ అయినట్లుగా కనిపిస్తోంది.. బెంగళూరులో రూ.4 లక్షలు, చెన్నైలో రెండు లక్షలు అడ్వాన్స్ బుకింగ్ జరిగాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలు కలుపుకొని సుమారుగా 80 లక్షల రూపాయలకు పైగా అడ్వాన్స్ బుకింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది.

ఇక అడ్వాన్స్ బుకింగ్ విషయాన్ని పక్కన పెడితే కరెంట్ బుకింగ్ పలు ప్రాంతాలలో భారీ స్పందన లభించింది. ఈ సినిమా నుంచి మొత్తం కలెక్షన్లు భారీగానే నమోదయ్యాయని తెలుస్తోంది.ఈ సినిమా మొదటిరోజు దాదాపుగా రూ.3.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమెరికాలో 19 k డాలర్లు రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా రూ.2 నుంచి రూ.4 కోట్ల రూపాయల పైగా వసూలు రాబట్టవచ్చని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news