మాతృమూర్తి ఆశీర్వాదం కోరుకుంటూ ప్రధాని మోడి మాట్లాడిన వీడియో.

-

నేడు ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ 100 వ సంవత్సరంలో అడుగు పెట్టారు. తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోడీ తల్లి దగ్గరకు వెళ్లి కాళ్లు కడిగి.. ఆశీర్వాదం తీసుకున్నారు.” ఈరోజు మా అమ్మ శ్రీమతి హీరాబెన్ తన వందో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారని.. ఇది మీ అందరి తోనూ పంచుకోవడం చాలా సంతోషంగా, అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు మోడీ.

మా అమ్మ వందో సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఏడాది.. మా నాన్న జీవించి ఉంటే.. తను కూడా గత వారం తన 100వ పుట్టినరోజు జరుపుకునే వారని తండ్రిని గుర్తు చేసుకున్నారు మోడీ. గుజరాత్ లో ఒక రోజు పర్యటన చేయనున్నారు మోడీ. పావగఢ్ ఆలయాన్ని సందర్శించనున్నారు. ప్రస్తుతం ఆయన వడోదర ర్యాలీలో ప్రసంగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news