వరంగల్ జిల్లా : ఎంజీఎం మార్చురీ నుంచి రాకేష్ అంతిమ యాత్ర కాసేపటి క్రితమే ప్రారంభమైంది. యాత్ర కు హాజరైన అశేష జనవాహినిని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, సహా ఎమ్మెల్యేలు ఎంపీలు వెంట నడవడంతో అంతిమయాత్ర కొనసాగుతోంది.
అంతేకాదు.. రాకేష్ పాడేను కూడా మంత్రి ఎర్రబెల్లితో పాటు ఎమ్మెల్యేలు మోశారు. అంతిమ యాత్రకు మద్దతుకు మద్దతు పలికాయి వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ, బిఎస్పి. వరంగల్ నగరంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగుతున్న యాత్ర అడుగడుగునా పోలీసులు బలగాలు మోహరించాయి.
అంతిమయాత్రకు హాజరై నివాళులర్పించారు కవులు, కళాకారులు, ప్రజాసంఘాల నేతలు. బిజెపి విధానాలు ఆర్పిఎఫ్ పోలీసుల కాల్పులు నిరసిస్తూ నల్లజెండాలతో భారీ ప్రదర్శన చేవారు. ప్రధాని మోడీ బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు యువకులు. 60 కిలోమీటర్ల మేర కొనసాగనుంది అంతిమయాత్ర. వరంగల్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అంతిమయాత్రలో స్వచ్ఛందంగా పాల్గొంటుంది యువత.