కార్తీకదీపం ద్వారా వంటలక్క సంపాదన ఎంతంటే..?

బుల్లితెరపై మోస్ట్ పాపులర్ టీవీ సీరియల్ గా గుర్తింపు తెచ్చుకున్న కార్తీక దీపం 2017 వ సంవత్సరంలో ప్రారంభమై గత సోమవారం ముగిసింది. సుదీర్ఘకాలంగా నంబర్ వన్ సీరియల్ గా కొనసాగిన ఈ సీరియల్ ఇండియన్ టాప్ రేటింగ్ దక్కించుకున్న సీరియల్ గా కూడా రికార్డు సొంతం చేసుకుంది. అలాంటి కార్తీకదీపం సీరియల్ ఎట్టకేలకు ముగిసిపోయింది.

ఈ విషయాన్ని యూనిట్ సభ్యులు ప్రకటించడంతో ప్రేక్షకులంతా ఆశ్చర్యపోయారు సీరియల్ ను ఏదో విధంగా పొడిగిస్తూ ఉంటారని అందరూ భావించారు.కానీ ఈ సీరియల్ పొడిగించడం ఇక సాధ్యం కావడం లేదు అని మేకర్స్ ప్రకటించడం జరిగింది. ఇందులో డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్ పాత్రను పోషించిన నిరుపమ్ అలాగే వంటలక్క అలియాస్ దీప పాత్రను పోషించిన ప్రేమీ విశ్వనాథ్ లు ఈ సీరియల్ ద్వారా ఎంత సంపాదించారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది.

కార్తీకదీపం సీరియల్ ద్వారా సంపాదించిన మొత్తం ఒక హీరో హీరోయిన్ సంపాదనతో సమానం అంటూ బుల్లితెర వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. కార్తీకదీపం సీరియల్ స్టార్ కి ఉన్న పేరు, గుర్తింపు ,వారి స్టార్ రేంజ్ తో పాటు కోట్ల రూపాయల పారితోషకం కూడా దక్కించుకున్నారని సమాచారం. ముఖ్యంగా కార్తీకదీపం సీరియల్ కి ఆయువు పట్టు అయిన వంటలక్క అలియాస్ ప్రేమీ విశ్వనాథ్ తన డిమాండ్ మేరకు ఒక్కరోజు ఎపిసోడ్లో పాల్గొంటే 25 వేల రూపాయలను తీసుకునేది. దీన్ని బట్టి చూస్తే 2017 నుంచి ఇప్పటివరకు సాగిన సుదీర్ఘ ప్రయాణంలో ఆమె కొన్ని వందల కోట్ల రూపాయలు కూడబెట్టింది అని చెప్పడంలో సందేహం లేదు.