Telangana TET: తెలంగాణ టెట్ పరీక్షల తేదీల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆన్‌లైన్‌లో మే 20 నుంచి జూన్ 3 మధ్య టెట్ పరీక్షలు ఉంటాయని ప్రకటన చేసింది తెలంగాణ విద్యాశాఖ అధికారులు. మే 25, 26, 27 తేదీల్లో పరీక్ష ఉండదని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
టెట్ పరీక్షలు వాయిదా పడలేదని….ఎమ్మెల్సీ పోలింగ్ రోజు అంతకు ముందు రోజు పరీక్ష లేదని వివరించారు. మే 27 న ఎమ్మెల్సీ ఎన్నిక ఉందని…అందుకే మే 25, 26, 27 తేదీల్లో పరీక్ష ఉండదని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఇంకా పరీక్ష తేదీలను ఫైనల్ చేయలేదని…త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తామన్నారు.