YSRCP leader Mudragada Padmanabham: తన కూతురు క్రాంతి వ్యాఖ్యలపై స్పందించారు వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం. నా కూతురుకు పెళ్లి అయ్యిందని… తాను పెళ్లి కాకముందు వరకే నా ప్రాపర్టీ అన్నారు. ఇప్పుడు ఆమె మెట్టినిల్లె ఆమె ప్రాపర్టీ అని…. నన్ను నా కూతురుతో కొంత మందితో తిట్టించారని టీడీపీ-జనసేనపై ఆగ్రహించారు ముద్రగడ.
ఇది బాధాకరమని… రాజకీయం రాజకీయమే, కూతురు కూతురేనన్నారు. నేను ఒకసారి వైఎస్ఆర్సీపీ లో చేరాను..ఇక పక్క చూపులు చూడను….ఎవరెన్ని అనుకున్న సీఎం జగన్ మళ్ళీ సీఎం కావడం ఖాయం అని స్పష్టం చేశారు. నేను పదవుల కోసం పాకులాడను….పదవులు కూడా అడగనన్నారు. నేను సేవకున్ని అనిస్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం.