సాహో డిజిటల్ రైట్స్.. ప్రభాస్ దమ్మేంటో చూపించాడు

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో 200 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా సాహో. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ నటిస్తుంది. హాలీవుడ్ తరహాలో యాక్షన్ సీన్స్ తో వస్తున్న సాహో మేకింగ్ వీడియోతో సినిమాపై అంచనాలు పెంచారు. బాహుబలి తర్వాత నేషనల్ వైడ్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ప్రభాస్ సాహోతో మరోసారి సత్తా చాటాలని చూస్తున్నాడు.

ఇక ఈ సినిమా డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ అన్ని 70 కోట్లకు జీ నెట్ వర్క్ కొనేసిందట. ఇన్నాళ్లు తెలుగు సినిమాల డిజిటల్ రైట్స్ కేవలం 20 కోట్ల లోపే ఉండేవి కాని బాహుబలితో సీన్ మారింది. తెలుగు సినిమా స్థాయి ఏంటో రాజమౌళి చూపించాడు. దానికి కొనసాగింపుగా వస్తున్న ప్రభాస్ సాహో కచ్చితంగా అంచనాలకు తగినట్టుగా ఉంటుందని అంటున్నారు.

ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి బాక్సాఫీస్ పై తన పంజా విసరనున్నాడు. ప్రీ రిలీజ్ బిజినెస్ కచ్చితంగా 300-400 కోట్ల దాకా జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. సాహో సినిమా 2019 ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ కాబోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version