బ‌తుక‌మ్మ పాట వివాదంపై స్పందించిన హైప‌ర్ ఆది.. ఏమ‌న్నారంటే!

-

జ‌బ‌ర్ధ‌స్త్ న‌టుడు హైప‌ర్ ఆదికి ఎంత క్రేజ్ ఉందో ఆయ‌న‌పై కూడా అన్నే వివాదాలు ఉన్నాయి. త‌న పంచ్‌ల‌తో ఇప్పుడున్న అనేక విష‌యాల‌పై ఆయ‌న జోక్యం చేసుకుంటుంటారు. దీంతో కొన్నిసార్లు ఆయ‌న‌పై ఫిర్యాదులు కూడా వ‌స్తున్నాయి. రీసెంట్గా ఆయ‌న త‌న స్కిట్ లో భాగంగా చేసిన ప్రోగ్రామ్‌లో బ‌తుక‌మ్మ‌ను అవ‌మానించాడ‌ని వివాదం మొద‌లైంది.

తెలంగాణ బ‌తుక‌మ్మ పాట‌ను హేళ‌న‌గా మాట్లాడి అవ‌మానించాడంటూ తెలంగాణ జాగృతి స్టూడెంట్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హైపర్ ఆది దీనిపై క్షమాపణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. అంతే కాదు ఎల్బీన‌గ‌ర్ స్టేష‌న్‌లో దీనిపై ఫిర్యాదు కూడా చేశారు. ఆదిని హైదరాబాద్ లో తిరగలేకుండా చేస్తామని కూడా హెచ్చ‌రించారు.

అయితే దీనిపై తాజాగా హైప‌ర్ ఆది స్పందించారు. ఎవరో బతుకమ్మ పాట స్ట్రాట్ చేశారని చెప్పుకొచ్చాడు. తాను కేవలం ఆ పాట‌ను మాత్ర‌మే అనుసరించానని అంతేకానీ ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడలేదని ఆది వివరణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఇక తాను రాసుకుని, అన్న పదాన్ని ఎడిటింగ్ లో తీసేయ‌డం వ‌ల్లే ఇదంతా జ‌రిగింద‌ని చెప్పాడు ఆది. ఇక తాను ఒక‌వేళ తప్పు మాట్లాడితే క్షమాపణ చెప్పడానికి కూడా అభ్యంతరం లేదని స్ప‌ష్టం చేశారు హైప‌ర్ ఆది.

Read more RELATED
Recommended to you

Latest news