హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చా..కానీ – జబర్దస్త్ కమెడియన్..!

-

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే చాలామంది ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ ఉంటారు. అయితే తమ గమ్యాన్ని చేరుకునే దిశలో ఎన్నో అవంతరాలు, అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ కాలం కలిసి రాక తాము అనుకున్న గమ్యాన్ని చేరలేక వేరొక పాత్రలతో తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి వారిలో జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న గడ్డం నవీన్ కూడా ఒకరు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా భారీ పాపులారిటీ తెప్పించుకున్న ఈయన గుబురు గడ్డంతో ఆయనకు మాత్రమే సాధ్యమైన ఎక్స్ప్రెషన్స్ తో బుల్లితెర ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటారు.

బుల్లితెరతో వచ్చిన గుర్తింపు నేడు వరుసగా సినిమాలు చేసేలా చేసింది ..ప్రస్తుత ఆయన చేతిలో పదికి పైగా సినిమాలు ఉండగా.. ఇప్పటికే సినిమా పరిశ్రమలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఇక ఈరోజు ఆయన పుట్టినరోజు కావడంతో ఆయన గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. 1995లో ఇండస్ట్రీకి వచ్చిన గడ్డం నవీన్ వయసు ప్రస్తుతం 47 సంవత్సరాలు. ఇక ఆయన మాట్లాడుతూ.. నా తల్లిదండ్రులు కృష్ణ ,సక్కుబాయి..మాది మధ్యతరగతి కుటుంబము.. నాన్న ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన కూడా ఆర్థిక కష్టాలు వెంటాడేవి . ఒకపక్క చదువుకుంటూనే మెకానిక్ షాప్ లో ,బట్టలు షాప్ లో కూడా పనిచేశాను.

ఆఫీస్ బాయ్ గా పని చేస్తున్నప్పుడు 1995 నుంచి సినీ అవకాశాల కోసం ప్రయత్నం చేశాను. అప్పటికే నాకు పెళ్లయి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. నా తల్లిదండ్రులు నేను నటుడిగా ఎదగాలని ఎంతో అనుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్లు లేరు. అదే నాకు పెద్ద బాధ కలిగిస్తుంది. నేను లోకల్ కాబట్టి సినీ ఇండస్ట్రీలో ఆకలి బాధలు పడలేదు కానీ మిగతా అన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నాను. ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగాను. ఆ సమయంలోనే రాంగోపాల్ వర్మ నన్ను సెలెక్ట్ చేశారు. హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. మొదటిసారి సిల్వర్ స్క్రీన్ పై కృష్ణ యాక్షన్ సీన్స్ చూసి బాగా ఫిదా అయ్యాను. కానీ కొన్ని కారణాల వల్ల కమెడియన్ గా సెటిల్ కావాల్సి వచ్చింది అంటూ తెలిపారు. నిర్మాత కావాలన్నదే నా లక్ష్యం ఎప్పటికైనా నిర్మాతగా మారి ఒక సినిమా చేస్తానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news