ఎడిట్ నోట్: హస్తం ఆపరేషన్.!

-

వరుసగా రెండు ఓటములు…రెండు సార్లు అధికారానికి దూరమైంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు విజయాలు దూరమయ్యాయి. పైగా కే‌సి‌ఆర్..కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎంత దెబ్బ తీయాలో తీశారు.. కానీ రాష్ట్రంలో వేరే ప్రత్యామ్నాయం కనబడటం లేదు. మధ్యలో బి‌జే‌పి కాస్త హడావిడి చేసింది..కానీ బి‌ఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాలేకపోయింది. ఈ నేపథ్యంలో మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుంది. ఈ సారి ఎన్నికల్లో గెలుపే దిశగా పనిచేస్తుంది.

అయితే బలంగా ఉన్న బి‌ఆర్‌ఎస్ పార్టీని ఢీకొట్టడం అనేది ఈజీ కాదు. పైగా ఎప్పుడు గ్రూపు గొడవలతో మునిగి తేలే కాంగ్రెస్ పార్టీకి గెలుపు అనేది దూరంగానే ఉంది. కానీ రెండు సార్లు ఓడిపోయిన సానుభూతి..అటు సహజంగానే అధికార బి‌ఆర్‌ఎస్ పై ఉన్న వ్యతిరేకత కలిసొస్తుందని భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ జోరు పెంచింది. ఎన్నికల సమయం దగ్గరపడటం, అటు బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధుల ప్రకటన నేపథ్యంలో దూకుడు పెంచి..ఆపరేషన్ షురూ చేసింది. ఓ వైపు అభ్యర్ధుల ఎంపికపైన దృష్టి పెడుతూనే..మరోవైపు బి‌ఆర్‌ఎస్ లోని బలమైన నేతలని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే బి‌ఆర్‌ఎస్ లో సీట్లు దక్కని నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. పలువురు నేతలు కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇక తాజాగా మరికొందరు అదే దిశగా ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మంలో సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావుని తాజాగా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు కలిశారు. కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఇక బి‌ఆర్‌ఎస్ లో సీటు దక్కని తుమ్మల..కాంగ్రెస్ లోకి వచ్చి పాలేరు బరిలో నిలిచేందుకు చూస్తున్నారు.

అటు షర్మిల సైతం తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి..కాంగ్రెస్ వైపు రావడానికి రెడీ అయ్యారు. ఇలా బి‌ఆర్‌ఎస్ పార్టీకి ధీటుగా ముందుకెళుతుంది. అయితే కే‌సి‌ఆర్ వ్యూహాలని తట్టుకుని కాంగ్రెస్ ఎంతవరకు నిలబడుతుంది..ఎన్నికల్లో ఏ మేర పోటీ ఇచ్చి..సత్తా చాటుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news